1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (16:40 IST)

అమేజాన్ సంచలన నిర్ణయం.. 18వేల మంది ఉద్యోగులపై వేటు

Amazon
ఆర్థిక మాంద్యం కారణంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 18,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్టు అమేజాన్ సంచలనం రేపింది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అమేజాన్‌లో 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 18,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు నివేదించబడింది. 
 
ఇది అమేజాన్ ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆర్థిక మాంద్యం సహా ఇతర కారణాలతో ఖర్చులను తగ్గించుకునేందుకు అమేజాన్ 18,000 మంది ఉద్యోగులను తొలగించబోతోందని తెలుస్తోంది. ఇంకా సంస్థ తొలగించే ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం చేరవేస్తామని అమేజాన్ పేర్కొంది.