సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

ఓటీటీలో అడవిశేష్ 'హిట్-2' మూవీ - ఎప్పటి నుంచంటే..

Hit2
టాలీవుడ్ యువ హీరో అడవిశేష్ నటించిన తాజా చిత్రం "హిట్-2". ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇపుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 2వ తేదీన థియేటర్లలో విడుదల కాగా, ఈ నెల 13వ తేదీ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనే ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
 
ఇక అడవిశేష్ ఈ సినిమాతో వరుసగా ఆరు హిట్స్ సాధించి డబుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరక్కిన ఈ చిత్రం "హిట్" యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో అడవిశేష్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. కోమలి ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించే ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్లు సినిమాస్ బ్యానర్లపై హీరో నాని, ప్రశాంతి తిరినేని నిర్మించాడు. ఇక మూడో పార్ట్‌లో నాని కథానాయకుడిగా నటించనున్నాడు.