బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (12:44 IST)

కాల్‌గర్ల్ కోసం సెర్చ్ చేసి ... రూ.1.97 లక్షలు పోగొట్టుకున్న టెక్కీ

victim
కాల్‌గర్ల్ (వ్యభిచారిణి) కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సైబర్ నేరగాడి చేతిలోపడి రూ.1.97 లక్షలు పొగొట్టుకున్నారు. చందానగర్‌లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగం డిసెంబరు చివరి వారంలో ఆన్‌లైన్ కాల్‌గర్ల్ కోసం (ఎస్కార్ట్ సర్వీస్) వెతికాడు. 
 
ఓ వెబ్‌సైట్లో కనిపించిన లింకు క్లిక్ చేయగానే వాట్సాప్ నంబర్ దొరికింది. పటేల్ చార్మి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్ ద్వారా కొందరు నంబరు దొరికింది. పటేల్ చార్మి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్ ద్వారా కొందరు అమ్మాయిల చిత్రాలు పంపాడు. 
 
బుకింగ్ కోసం 510, తర్వాత 5500, అనంతరం సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7800, ఇలా వేర్వేరు కారణాలు చెబుతూ రూ.1.97 లక్షలు కాజేశాడు. చివరకు మోసపోయినట్టు తెలుసుకున్న బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశాడు.