బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తల్లిని చంపిన కుమార్తె

murder
తన ప్రియుడితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన ఓ కుమార్తె దారుణానికి పాల్పడింది. తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని కడతేర్చింది. ఇపుడు ఈ ప్రేమికులు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో జరుగుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్వాలియర్‌కు చెందిన 17 మైనర్ బాలిక అదే ప్రాంతానికి 25 యేళ్ళ యువకుడిని ప్రేమించి, పెళ్లికి ముందే రిలేషన్‌ కొనసాగించడం ఆరంభించింది. ఈ విషయం కన్నతల్లికి తెలిసి, కుమార్తెను మందలించింది. ప్రియుడితో ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలని, పెళ్లికి ముందే రిలేషన్‌కు స్వస్తి చెప్పాలని హితబోధ చేసింది. ఈ మాటలు ఏమాత్రం పట్టించుకోని కుమార్తె... తన ప్రియుడితో కలిసి రెండు నెలల క్రితం లేచిపోయింది. 
 
ఆ సమయంలో ఆ యువతి మైనర్ కావడంతో తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వారిద్దరిని పట్టుకున్నారు. ప్రియుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇటీవలే బెయిలుపై విడుదైన ఆ యువకుడిని బాలిక కలుసుకోవడం మొదలుపెట్టింది. అయితే, తామిద్దరం హాయిగా జీవించాలంటే అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని తన ప్రియుడితో కలిసి నిర్ణయించి, తాము అనుకున్న ప్లాన్ ప్రకారం తల్లిని చంపేసింది. చివరకు పోలీసులకు చిక్కి ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తుంది.