ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (10:29 IST)

రూ.1.25 కోట్ల వేతనం వదులుకుని సన్యాసం స్వీకరించనున్న డేటా సైంటిస్ట్

mpmonk
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డేటా సైంటిస్ట్ ఒకరు రూ.1.25 కోట్ల వార్షిక వేతనం వదులుకుని సన్యాసం స్వీకరించనున్నారు. విలాసవంతమైన జీవితంపై విరక్తి చెందిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అతని వయసు 28 యేళ్ళు. ఈ నెల 26వ తేదీన సన్యాసిగా మారనున్నాడు. పేరు ప్రన్సుఖ్ కాంతేడ్. అమెరికాలో సైంటిస్ట్ ఉద్యోగం చేస్తూ, కోట్లలో వేతనం, అమెరికాలో విలాసవంతమైన జీవితం.. ఇలా అన్నీ వదులుకుని సన్యాసిగా మారనున్నారు. 
 
గత 2016లో అమెరికాకు వెళ్లిన ఆయన... అక్కడే ఉన్నత విద్యాభ్యాసం చేసి డేటా సైంటిస్టుగా ఉద్యోగం సంపాదించాడు. యేడాదికి రూ.1.25 కోట్ల ప్యాకేజీతో లభించిన ఉద్యోగం ఆయనకు ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. డబ్బుతో వచ్చే విలాసవంతమైన జీవితం పట్ల ఆయనకు విముఖత కలిగింది.
 
దీంతో ఉద్యోగాన్ని, అమెరికాను వదిలేసి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన.. ఈ నెల 26వ తేదీన సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాడు. జైన మత గురువు జినేంద్ర ముని వద్ద సన్యాస దీక్ష తీసుకోనున్నారు. అందుకు అందటి కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టకపోవడం గమనార్హం. పైపైచ్చు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.