శనివారం, 25 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 19 నవంబరు 2022 (20:28 IST)

మధ్యప్రదేశ్ ఆస్పత్రి ఐసీయూలోకి ఆవు.. తరిమికొట్టేందుకు ఎవ్వరూ లేరు..

cow2
మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లా ఆస్పత్రిలోకి అనుకోని అతిథి వచ్చింది. ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులోకి ఆవు ప్రవేశించింది. అంతేగాకుండా.. ఐసీయూలోకి వచ్చిన ఆవును తరిమేందుకు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పేషెంట్లు షాక్‌కు గురయ్యారు. 
 
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ ఘటనతో సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.
 
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ఆదరణ రావడంతో ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డారు. సీనియర్‌ ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురు ఉద్యోగులను తొలగించారు.