శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 నవంబరు 2022 (19:10 IST)

షార్ప్ ప్లాస్మాక్లస్టర్ టెక్నాలజీతో ఆస్తమా పేషెంట్లు శ్వాస పీల్చుకోవడంలో అద్భుత రిలీఫ్

షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రవేట్‌ లిమిటెడ్‌ అనేది షార్ప్‌ కార్పొరేషన్ జపాన్ యొక్క యాజమాన్యంలో నడుస్తున్న భారతీయ అనుబంధ సంస్థ, షార్ప్‌ సంస్థ యొక్క ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినవి. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లలో ఉన్న ప్లాస్మాక్లస్టర్ అయాన్ టెక్నాలజీ (PCI) శ్వాసకోస వ్యాధుల్ని చాలా వరకు అడ్డుకుంటుందనే కొత్త అధ్యయనం ఫలితాలను ఇవాళ షార్ప్‌ సంస్థ పంచుకుంది. భారతదేశంలో అనారోగ్యం మరియు చాలా వరకు మరణాలకు ప్రధాన కారణం ఆస్తమా. రెస్పిరేటరీ మెడిసిన్- స్టెమ్ సెల్ పరిశోధనలో నిపుణుడు అయినటువంటి డాక్టర్ మునెమాసా మోరీ నేతృత్వంలో ఈ అధ్యయనాన్ని చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్‌లో ఈ అధ్యయనం నిర్వహించారు.

 
ప్రధానంగా ఈ అధ్యయనాన్ని ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు కప్పి ఉంచే మార్గంలో ఎయిర్‌వే ఎపిథీలియల్ కణాలతో శ్వాసకోశంపై ప్లాస్మాక్లస్టర్ అయాన్‌ల ప్రభావాలు అనే అంశంపై పరిశోధనలు చేశారు. ఈ ఎయిర్‌వే ఎపిథీలియం శ్లేష్మ కణాల నుండి శ్లేష్మ స్రావం, మోటైల్ సిలియేటెడ్ కణాలపై ఏక దిశలో కొట్టడం ద్వారా శ్లేష్మాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిశోధనలో భాగంగా, వాయుమార్గ కణజాల మూలకణాలు ఒక నెల వ్యవధిలోనే ఎపిథీలియల్ కణాలుగా విభజించబడ్డాయి. కల్చర్డ్ కణాలు షీట్ లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. గరిష్టంగా 24 గంటల పాటు ప్లాస్మాక్లస్టర్ అయాన్‌లకు బహిర్గతమవుతాయి.

 
మరోవైపు పరిశోధనాత్మక అధ్యయనంలో భాగంగా, ఆస్తమా రోగుల శ్వాసనాళంలో అత్యంత జిగట శ్లేష్మం రోజురోజుకి తగ్గడాన్ని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా తక్కువ- శ్లేష్మానికి సంబంధించి ప్రోటీన్‌తో ముడిపడి ఉన్న మార్కర్‌లో పెరుగుదలను కనుగొన్నారు. ఈ మార్పులు ఊపిరి ఆడే మార్గాన్ని, శ్లేషాన్ని మెరుగుపరచడం ద్వారా లక్షణాల ఉపశమనానికి దారితీయవచ్చు, ఇది ఉబ్బసం రోగులలో ముఖ్యమైన సమస్య.

 
ఈ సందర్భంగా షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నరితా ఒసాము మాట్లాడారు. "భారతీయ నగరాల్లో కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల శ్వాసకు సంబంధించిన కొత్త సమస్యలు వస్తున్నాయి. స్వచ్ఛమైన, సహజమైన గాలిని పొందడం ఇప్పుడు కష్టతరంగా మారింది. పిల్లలు, వృద్ధులు, ఇప్పటికే శ్వాసకోశ సమస్య ఉన్న వ్యక్తులకు ఈ పరిస్థితి మరింత కష్టంగా ఉంది. కాలుష్యం పెరగడం వల్ల ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్నవాళ్లు చనిపోతున్న సందర్భాలూ లేకపోలేదు. ఇదే సమయంలో తాజా అధ్యయన ఫలితాలు ఆస్తమా రోగులకు శుభవార్తే అని చెప్పాలి.

 
ఎందుకంటే ఈ ఎయిర్‌ఫ్యూరిఫైయర్‌లో ఉన్న ప్లాస్మాక్లస్టర్ అయాన్ టెక్నాలజీ వాయునాళాల్లో ఉన్న శ్లేష్మాన్ని బాగా తగ్గింస్తుంది. దీనివల్ల ఆస్తమా రోగులు త్వరితగతిన ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా బయట నుంచి గాలి నుండి విషపూరిత వాయు కాలుష్యాలను గుర్తించడంలో, తొలగించడంలో సమర్థత ఈ ఎయిర్‌ఫ్యూరిఫైయర్లు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి, మా ఉత్పత్తుల ప్రభావాన్ని మరింత మెరుగుపరచడానికి నిపుణులు మరియు సంస్థలతో మేము స్థిరంగా పని చేస్తున్నాము అని అన్నారు.

 
కొలంబియా యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మునెమాసా మోరి మాట్లాడుతూ, ''వైరస్‌లను తగ్గించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్లాస్మాక్లస్టర్ టెక్నాలజీ మానవ శ్వాసకోశ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై నాకు ఆసక్తి ఉంది. కాబట్టి నేను, నా బృందం ప్రయోగానికి రూపకల్పన చేసి నిర్వహించాము. మేము ప్లాస్మాక్లస్టర్ అయాన్‌లను నేరుగా మానవ కణజాల-నిర్దిష్ట మూలకణాల నుండి వేరు చేసిన వాయుమార్గ ఎపిథీలియల్ కణాలకు బహిర్గతం చేసాము. దీనివల్ల శ్లేష్మ గుర్తులలో మార్పులను గమనించాం.


ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది కణజాల స్థాయిలో ఆస్తమా ఉపశమనానికి దారితీస్తుంది. అంతేకాకుండా రోగి యొక్క కణాలను ఉపయోగించి ప్లాస్మాక్లస్టర్ అయాన్ల ప్రభావాల యొక్క తదుపరి మూల్యాంకనాన్ని పరిశోధించడానికి మేము సంతోషిస్తున్నాము, ప్లాస్మాక్లస్టర్ టెక్నాలజీ యొక్క సాంకేతిక పురోగతుల కోసం నేను ఎదురు చూస్తున్నాను, అది చివరికి కొత్త చికిత్సలకు దారి తీస్తుంది అని అన్నారు.