సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 నవంబరు 2022 (14:39 IST)

సమంత కోసం చాలా కేర్ తీసుకుంటున్న పవన్ కల్యాణ్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేర్ తీసుకుంటున్నారట. అత్తారింటికి దారేది కో-స్టార్ సమంత ప్రస్తుతం అనారోగ్యం బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ సమంత ఆరోగ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారట. సమంతకు చికిత్స అందించేందుకు ఫారిన్ నుంచి నిపుణులైన వైద్యులను రప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.
 
ఇందులో భాగంగా మయోసైటిస్‌కి సంబంధించిన స్పెషలిస్ట్స్, కండరాల నిపుణులను భారత్‌కు రప్పిస్తున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే చాలామటుకు పూర్తయినట్లు వినికిడి. సమంత ఆరోగ్యం కోసం పవన్ చాలా కేర్ తీసుకుంటున్నాడని.. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారట. 
 
కోట్లు ఖర్చుపెట్టి సమంతకు ఖరీదైన వైద్యం అందించేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పవన్ కల్యాణ్‌పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.