1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Actress Sada Doing Prostitution Job in torch light movie

పాపం.. వేశ్యగా మారిన సదా... రియల్ లైఫ్‌లో కాదు..

తేజ - జయం రవి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "జయం". ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ జయం. ఇందులో అచ్చ తెనుగు ఆడపిల్లగా హీరోయిన్ సదా కనిపిస్తుంది. వాస్తవానికి ఈమె ఓ ముస్లిం కుటుంబం నుంచి చిత్ర

Actress Sada
తేజ - జయం రవి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "జయం". ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ జయం. ఇందులో అచ్చ తెనుగు ఆడపిల్లగా హీరోయిన్ సదా కనిపిస్తుంది. వాస్తవానికి ఈమె ఓ ముస్లిం కుటుంబం నుంచి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన అపరిచితుడు చిత్రంలో నటిచింది. ఇపుడు అవకాశాలు లేక బుల్లితెర రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
 
కానీ ఏ సినిమాలోనూ.. ఏ షోలోనూ డ్రెస్సింగ్ విషయంలో కానీ అందాల ఆరబోతలో కానీ హద్దు దాటింది లేదు. అలాంటి సదా తమిళ్‌లో తెరకెక్కనున్న "టార్చిలైట్" అనే మూవీలో వేశ్యగా నటిస్తోందట. అబ్దుల్ మజీత్ దర్శకత్వంలో అర్థరాత్రి హైవేలపై విటుల కోసం ఎదురు చూసే క్యారెక్టర్‌లో సదా మెప్పించనుంది. అనుష్క కూడా ఓ సినిమాలో వేశ్య క్యారెక్టర్‌ను పోషించిన విషయం విదితమే. డైరెక్టర్ ఎందరో హీరోయిన్స్‌ని సంప్రదించారట. కానీ వేశ్య క్యారెక్టర్ అనగానే వెనక్కు తగ్గారట. సదా మాత్రం కథ విన్న వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ మూవీని డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పవన్ నటనంటే నాకు చాలా ఇష్టం : భానుప్రియ