సంబంధిత వార్తలు
- హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చండిక ఆరంభం
- పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమ వివాహాలే పెటాకులవుతున్నాయ్: సుప్రీం
- విడాకులు తీసుకున్న ఆనందంలో బంగీ జంప్... వికటించి ఆస్పత్రిపాలు
- భర్తతో విడాకులు.. ఇక స్నేహితులుగా కలిసివుంటాం: ఫిన్లాండ్ ప్రధాని
- హెడ్‌లైన్స్ కోసం విడాకుల అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తారా? మీడియాపై నాగ చైతన్య ఫైర్
రాహుల్ శర్మతో అసిన్ విడాకులు తీసుకుందా?
Asin
అభిప్రాయభేదాల కారణంగా చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ అసిన్ విడాకులు తీసుకోబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అసిన్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించింది.
తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆమె తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ దగ్గుబాటి, నాగార్జున, రవితేజ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ సాధించింది. గజిని సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ స్టార్‌డమ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు 2016లో వ్యాపారవేత్త రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అసిన్ సినిమాలకు దూరంగా ఉంది. పెళ్లయిన తర్వాత దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రాహుల్‌కి మరో అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని అసిన్‌కు తెలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచి అసిన్ అతనికి దూరంగా ఉంటోంది.
ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం అసిన్ పాపతో ఉంటోందని వార్తలు వస్తున్నాయి. రాహుల్‌తో విడాకులు తీసుకోవాలని అసిన్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అసిన్ విడాకులు తీసుకుంటుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి విడాకుల వార్తలపై అసిన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
తర్వాతి కథనం
