గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జూన్ 2023 (12:16 IST)

కియారా అద్వానీ ప్రెగ్నెంట్‌గా వుందా?

Kiara Advani
Kiara Advani
బాలీవుడ్ నటి కియారా అద్వానీ ప్రస్తుతం తన రాబోయే చిత్రం సత్యప్రేమ్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా కియారా అద్వానీ ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో కియారా బేబీ బంప్‌తో కనిపించారు. సత్యప్రేమ్‌కి సినిమా ప్రమోషన్‌లో భాగంగా నటి తన సహ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి రాజస్థాన్ వెళ్లింది. 
 
ఇటీవల, కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జైపూర్ నుండి ఒక సూపర్ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలు ఆమె ప్రెగ్నెంట్‌గా వున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రాలెట్ టాప్, ఫుల్ జాకెట్, ప్యాంటు ధరించింది. ఇందులో ఆమె చాలా అందంగా కనిపించింది. 
 
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ‘కియారా గర్భవతిగా ఉందా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. కియారా, సిద్ధార్థ్‌లకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది రాజస్థాన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ హాలీడేకి జపాన్ వెళ్లి ఆ తర్వాత తమ తమ సినిమాల షూటింగ్‌లలో బిజీ అయ్యారు.