బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (14:41 IST)

గర్భం దాల్చిన ప్లస్ వన్ విద్యార్థిని.. ప్రేమికుడిపై కేసు

తమిళనాడు, కడలూరులో ప్లస్ వన్ విద్యార్థిని గర్భం దాల్చింది. ఇంకా ఈ గర్భానికి కారణమైన కాలేజీ విద్యార్థినిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కడలూరు ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల ప్లస్ 1 విద్యార్థికి, 19 ఏళ్ల కాలేజీ విద్యార్థి ప్రేమించుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్లస్ వన్ విద్యార్థిని ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి కావడంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఇంకా 18 ఏళ్లు నిండని బాలిక గర్భవతి అని వైద్యులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. 
 
ప్లస్ వన్ విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కళాశాల విద్యార్థినిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.