1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Baahubali Siren To Team Up With Venky

వెంకీ సినిమాలో మోగనున్న బాహుబలి సైరన్?

సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి తాజాగా తేజతో చేతులు కలిపాడు. నయనతారతో బాబు బంగారంతో హిట్ కొట్టి కాస్త వెనక్కి తగ్గిన వెంకీ మళ్లీ తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేటా నాదే అనే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ సిని

Venkatesh Daggubati
సీనియర్ హీరో వెంకటేష్ దగ్గుబాటి తాజాగా తేజతో చేతులు కలిపాడు. నయనతారతో బాబు బంగారంతో హిట్ కొట్టి కాస్త వెనక్కి తగ్గిన వెంకీ మళ్లీ తేజ దర్శకత్వంలో ఆటా నాదే వేటా నాదే అనే చిత్రంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తొలుత నయనతారను అనుకున్నారు.

అయితే ఆమెకు కాల్షీట్లు లేకపోవడంతో... కాజల్ అగర్వాల్, తమన్నా భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో.. బాహుబలి సైరన్.. దేవసేన, యోగా టీచర్ అనుష్కను హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే వెంకీ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనుష్కతో కలిసి చింతకాయల రవి, నాగవల్లి సినిమాల్లో రొమాన్స్ చేసిన వెంకీ, మూడోసారి అనుష్కతో కలిసి నటించనున్నాడు.

అనుష్క నటించిన భాగమతి సినిమా విడుదలకు రెడీ అవుతోంది. మరోవైపు కోలీవుడ్ హీరో అజిత్ సరసన నటించే అవకాశాన్ని కూడా అనుష్క సొంతం చేసుకున్నట్లు తెలిసింది.
తర్వాతి కథనం
ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం