మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (16:17 IST)

ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానం

ఐటీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వివిధ టెక్ కంపెనీలకు ప్రతిష్టాత్మకంగా భావించే ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డులు 2017ను ప్రదానం చేశారు.

ఐటీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వివిధ టెక్ కంపెనీలకు ప్రతిష్టాత్మకంగా భావించే ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డులు 2017ను ప్రదానం చేశారు.


ఈనెల ఒకటో తేదీన హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ వేడుకల్లో సౌదీ అరాంకో సీనియర్ సలహాదారు మొహ్మద్ ఇబ్రహీం అల్ ఖతానీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తమ సంస్థల అభివృద్ధితో పాటు ఐటీ సెక్టార్ పురోగతికి కృషి చేసిన సంస్థలను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రదానం చేశారు.
 
ఇందులోభాగంగా, క్యూబ్ సినిమా టెక్నాలజీస్ కో ఫౌండర్ వి.సెంథిల్ కుమార్‌కు ఇండీవుడ్ ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేశారు. అలాగే, ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టార్‌లో విశేష సేవలు అందించినందుకు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రసాద్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ సాయ్‌ప్రసాద్ అక్కినేనికి అందజేశారు.
 
ఇకపోతే, ఐటీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డులను అందుకున్న వారిలో రాహుల్ గెడుపూడి, నాగరాజన్, దశరథ్ ఆర్ గూడె, నిరంజన్ చింతమ్, వరుణ్ చంద్రన్, హరి భరద్వాజ్ తదితరులు ఉన్నారు. అలాగే, వివిధ కేటగిరీల అవార్డులను కూడా ఇచ్చారు.
 
ఈ అవార్డులు గెలుచుకున్న సంస్థల్లో టీసీఎస్, సిస్కో సిస్టమ్స్, క్యూబ్ సినిమా టెక్నాలజీస్, సీఏ టెక్నాలజీ తదితర ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఈ సందర్భంగా సినిమా రంగంలో ఐటీ సెక్టార్ ప్రభావం అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొని తమతమ అభిప్రాయాలను పంచుకున్నారు.