శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By tj
Last Updated : బుధవారం, 26 జులై 2017 (15:04 IST)

నవదీప్‌ను మళ్ళీ విచారించనున్న సిట్.. ఎందుకో తెలుసా..?

ఇప్పటికే ఆరుగురు సినీప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో సిట్ ముందు హాజరయ్యారు. హీరో తరుణ్‌‌తో పాటు కొంతమంది తమ రక్తనమూనాలతో పాటు వెంట్రుకలను కూడా ఇవ్వగా నవదీప్ మాత్రం అందుకు అంగీకరించలేదు.

ఇప్పటికే ఆరుగురు సినీప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో సిట్ ముందు హాజరయ్యారు. హీరో తరుణ్‌‌తో పాటు కొంతమంది తమ రక్తనమూనాలతో పాటు వెంట్రుకలను కూడా ఇవ్వగా నవదీప్ మాత్రం అందుకు అంగీకరించలేదు. 
 
గంటల తరబడి నవదీప్‌ను విచారించినా ఆయన మాత్రం రక్తనమూళాలు, వెంట్రుకలు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. కారణం వాటిని పరీక్షిస్తే ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయని. దీంతో తన కెరీర్ నాశనమయ్యే అవకాశం ఉందనేది నవదీప్ భావన.
 
అయితే నవదీప్‌ను లోతుగా విచారించి పంపేసిన సిట్ అధికారులు మళ్ళీ విచారించాలని నిర్ణయం తీసుకున్నారట. ఈసారి విచారణ మాత్రం రక్తనమూనాలు, వెంట్రుకలను తీసుకోవాడానికేనట. అయితే నవదీప్ ఈసారి విచారణలోనైనా వాటిని ఇస్తారో లేదోనన్నది వేచి చూడాల్సిన పరిస్థితి.