1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Heroine Nayanthara clarity on her love failures

వారికి నాపై నమ్మకం లేదు.. అందుకే రెండుసార్లు ప్రేమ విఫలమైంది...

Nayanathara
ఇటు తెలుగు, అటు తమిళ చిత్రపరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న నయనతార ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు సార్లు ప్రేమ విఫలమైంది. ఇపుడు మూడోసారి ప్రేమలోపడింది. అయితే, మొదటి రెండుసార్లు ప్రేమ విఫలం కావడానికి కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. కానీ, ఇపుడు క్లారిటీ ఇచ్చింది. ప్రేమ అంటే నమ్మకం.. ఆ నమ్మకం లేనిచోట ప్రేమ నిలబడదు అంటూ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చింది. 
 
ఇదే అంశంపై ఆమె ఇంకా మాట్లాడుతూ, ఒకరిపై మరొకరికి నమ్మకం లేనప్పుడు కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మేలని చెప్పింది. రెండు సార్లు తన ప్రేమ విఫలం కావడానికి ఇదే కారణమని తెలిపింది. నమ్మకం లేకపోవడంతోనే వారితో బంధాన్ని తెంచుకున్నానని... ఆ సమయంలో ఎంత బాధ అనుభవించానో తనకు మాత్రమే తెలుసని చెప్పింది. 
 
కానీ, మీడియా మాత్రం ఇష్టానుసారంగా పిచ్చిరాతలు రాయగా, జనాలు మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు అనుకున్నారని ఆవేదన వ్యక్తంచేసింది. ఆ బాధ నుంచి బయటకు రావడానికి తనకు చాలా కాలం పట్టిందని... సినిమాలే తనను మళ్లీ మనిషిని చేశాయని తెలిపింది. కష్టసమయంలో కూడా తన వెంట అభిమానులు ఉన్నారని కృతజ్ఞతలు తెలియజేసింది. 
 
కాగా, ఈ అమ్మడు తొలుత తమిళ యువ హీరో శింబుతో ప్రేమాయణ సాగించింది. వీరిద్దరూ ఏకాంత సమయంలో పెట్టుకున్న ముద్దులకు సంబంధించిన క్లిప్లింగ్స్ పెను సంచనమే రేపాయి. ఆ శింబుతో తెగదెంపులు చేసుకుని, కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవాతో ప్రేమలోపడి కొంతకాలం సహజీవనం చేసింది. కానీ, అతనితో కూడా మనస్పర్థలు తలెత్తడంతో దూరమైంది. ఇపుడు తమిళ దర్శకుడు విఘ్నేష్‌తో ప్రేమలోపడింది. 
తర్వాతి కథనం
నితిన్ పెళ్లికి అడ్డుపడుతున్న కరోనా వైరస్.. మళ్లీ వాయిదా..