సంబంధిత వార్తలు
- దసరా బ్లాక్‌బస్టర్ : ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ జాబితాలో 'జై లవ కుశ'
- టీ వీ షో అంటో ఒక కప్పు టీ తాగడం లాంటిది కాదు: మహేష్ బాబు
- సినిమాను బట్టి రివ్యూ ఉంటుంది... కక్షతో రివ్యూలు రాస్తామా? : మహేశ్ కత్తి
- ప్రతి గొట్టంగాడి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ
- చెర్రీ - జూనియర్ ఇద్దరూ కావాలి... అనుపమ పరమేశ్వరన్
'బిగ్ బాస్' సీజన్ - 2 హోస్ట్ జూనియర్ ఎన్టీఆరే!
తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్-1 ఇటీవల ముగిసింది. సీజన్ వన్ విజేతగా శివ బాలాజీ నిలిచాడు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బాగా చేశాడంటూ ప్రశంసలు బాగానే వచ్చాయి. ఇపుడు 'బ
తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్' సీజన్-1 ఇటీవల ముగిసింది. సీజన్ వన్ విజేతగా శివ బాలాజీ నిలిచాడు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బాగా చేశాడంటూ ప్రశంసలు బాగానే వచ్చాయి. ఇపుడు 'బిగ్ బాస్ 2' గురించిన చర్చ మొదలైంది.
ఒకవేళ 'బిగ్ బాస్ 2' మొదలైతే వ్యాఖ్యాత ఎవరనే విషయమై ‘బిగ్ బాస్’ అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎంతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ సీజన్-2కు హోస్ట్‌గా వ్యవహరించడని, తప్పుకుంటాడనే వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా హల్ చల్ చేశాయి.
అయితే, ‘బిగ్ బాస్’ సీజన్ -2కు కూడా జూనియర్ ఎన్టీఆరే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడని తెలిసింది. ఈ మేరకు ఓ న్యూస్ ఛానెల్ జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించగా తానే వ్యాఖ్యాతగా కొనసాగనున్నట్టు ఆయన చెప్పారట. అయితే, దీనిపై ఆ టీవీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
