1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Raviteja upcoming movie title Kiladi

రవి తేజ సినిమాకు మాస్ టైటిల్ కిలాడి

Raviteja
నటుడు రవితేజ ఇపుడు యమజోరును అందుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని కొత్త కథలు వినడానికి వినియోగించుకుంటున్నారు. పలువురు పాత, కొత్త దర్శకులు కలిసి ఆయనకు కథలు వినిపిస్తున్నారు. వీటిలో తనకు కొన్ని కథలు బాగా నచ్చడంతో నాలుగైదు కొత్త ప్రాజెక్టులను గ్రీన్నసిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.
 
అవన్నీ కూడా ఒన్ బై ఒన్ మొదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రమేష్ వర్మ దర్శకత్వంలో కూడా  సినిమా చేయడానికి రవితేజ ఓకే చెప్పారు. ఇందులో ఆయన రెండు వెరైటీ పాత్రలను పోషిస్తూ ద్విపాత్రాభినయం చేస్తాడని తెలుస్తోంది. 
 
ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఇప్పటికే రాశిఖన్నా, నిధి అగర్వాల్‌లను ఎంపిక చేశారు. ఇక ఈ చిత్రానికి కిలాడి అనే మాస్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. ఈ టైటిల్ రవితేజకు కూడా బాగా నచ్చడంతో దీనినే ఫైనల్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
తర్వాతి కథనం
అందాల ఆరబోతలో ఫస్ట్.. ఆమడదూరంలో అవకాశాలు