గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (18:43 IST)

ఆ పోస్టులపై యష్‌కు చిర్రెత్తుకొచ్చిందట (Video)

కె.జి.ఎఫ్ సినిమా ఏ స్థాయిలో హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతో యష్‌కు అభిమానులు అమాంతం పెరిగిపోయారు. కన్నడలోనే కాదు తెలుగులోను యష్‌ను అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భారీ కలెక్షన్లలో కూడా కెజిఎఫ్ రికార్డుల్లోకెక్కింది.
 
ఇదంతా ఒకే. అయితే రెండవ భాగం కెజిఎఫ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని.. త్వరలోనే సినిమాను విడుదల చేస్తారని సరిగ్గా లాక్ డౌన్ ముందు నుంచి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
 
ముఖ్యంగా యష్ అభిమానులే మరో వారంరోజుల్లో సినిమా రిలీజ్.. ఇంకో పదిరోజుల్లో రిలీజ్ అంటూ ఇలా ఒక్కొక్క డేట్‌ను వాళ్ళే ఫిక్స్ చేసేస్తున్నారు. ఇది కాస్త సినిమా విడుదలపై హైప్‌ను పెంచుతూ అభిమానుల్లో నిరుత్సాహాన్ని మిగిలిస్తోంది. 
 
అయితే ప్రస్తుతం ఈ సినిమాను ఓటిటిలో రిలీజ్ చేస్తారంటూ మరో ప్రచారం ఊపందుకుంది. ఇది కాస్త సినీ యూనిట్‌కు, ముఖ్యంగా యష్‌కు కోపం తెప్పిచింది. దీంతో యష్ రంగంలోకి దిగారు. ఇలాంటి మెసేజ్‌లను స్ప్రెడ్ చేయద్దంటూ అభిమానులను కోరారు. ఎందుకిలా చేస్తున్నారు. ఓటిటిలో కాదు థియేటర్లలోనే సినిమా విడుదలవుతుంది. అది కూడా అక్టోబర్ నెలలోనే సినిమా విడుదల ఉంటుందని యష్ తేల్చిచెప్పారట.