సంబంధిత వార్తలు
- మరో బ్యాంక్ స్కామ్ :రూ.3250 కోట్ల రుణాలు.. రూ.64 కోట్ల లంచం
- ఆర్థిక నేరస్తులు కూడా ప్రధానిని కలుస్తున్నారు... నాకేం భయం లేదు: చంద్రబాబు
- దక్షిణాది సొమ్ముతో ఉత్తరాదికి సోకులు : దక్షిణాది సెంటిమెంట్ లేవనెత్తిన చంద్రబాబు
- క్రిష్ 'అహం బ్రహ్మాస్మి' హీరో ఇతనే..!
- అలా మాట్లాడొద్దు.. శ్రీదేవి కోసం ఎంతో కష్టపడింది : బాబాయ్ వేణుగోపాల్
ఆ డైరెక్టర్‌తో బాగా కనెక్టయిన సాయిపల్లవి...
తెలుగు సినీపరిశ్రమలో సాయిపల్లవి అంటే తెలియని వారుండరు. ఒకే ఒక్క సినిమాతో తానేంటో నిరూపించుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఫిదా సినిమా తరువాత సాయి పల్లవికి చాలానే ఛాన్సులొచ్చాయి. కానీ తనకు నచ్చిన కథ, తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంటేనే ఆ సిని
తెలుగు సినీపరిశ్రమలో సాయిపల్లవి అంటే తెలియని వారుండరు. ఒకే ఒక్క సినిమాతో తానేంటో నిరూపించుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఫిదా సినిమా తరువాత సాయి పల్లవికి చాలానే ఛాన్సులొచ్చాయి. కానీ తనకు నచ్చిన కథ, తన క్యారెక్టర్‌కు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలకు ఓకే అంది సాయిపల్లవి. మిగిలిన సినిమాలను చేయనని తేల్చి చెప్పేసింది.
ఫిదా తరువాత ఆమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకుల్లోకి వెళ్ళలేదనే చెప్పాలి. దీంతో సాయిపల్లవి తనకు గతంలో ఉన్న పేరును తీసుకువచ్చే సినిమాను ఎవరైనా చేస్తే చేయడానికి సిద్ధంగా ఉంది. అలాంటి కథ, హిట్ సినిమాల డైరెక్టరే సాయిపల్లవికి దొరికాడు. అతనెవరో కాదు నీది నాదీ ఒకే కథ డైరెక్టర్ వేణు. సాయిపల్లవి కోసం ప్రత్యేకంగా వేణు ఒక కథను సిద్థం చేసి ఆమెకు వినిపించాడట.
ఇది సాయిపల్లవికి బాగా నచ్చింది. ఫిదా తరువాత అంతటి పేరు ఈ సినిమాకు ఖచ్చితంగా వస్తుందన్న నమ్మకం సాయిపల్లవితో ఏర్పడింది. దీంతో సాయిపల్లవి ఆ డైరెక్టర్‌కు ఫిదా అయ్యిందని తెలుగు సినీపరిశ్రమలోని వారు చెవులు కొరుక్కుంటున్నారు. మీ కథ నాకు బాగా నచ్చింది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించినా నేను రావడానికి సిద్థంగా ఉన్నానని దర్శకుడు వేణుకు చెప్పిందట సాయిపల్లవి.
