సంబంధిత వార్తలు
- Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్
- ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగరాదు, ఎందుకు?
- ఈ ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ చర్మం కాంతివంతం
- బ్లడ్ కౌంట్ పడిపోతుంది, గుమ్మడి గింజలు తింటే ప్రయోజనం వుంటుందా?
- క్యాల్షియం మాత్రలు అన్నం తిన్నాక ఎంత గ్యాప్ తీసుకుని వేసుకోవాలి?
పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అదసలు ఆరోగ్యకరమేనా?
చాలామందికి పన్నీర్ రకరకాల వంటల్లో కలిపి తినడం అంటే బాగా ఇష్టం. ఇక చపాతీల్లోకి అయితే పన్నీర్ కూరను చేసుకుని లాగించేస్తుంటారు. ఐతే ఈ పన్నీర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా అనేది మనం ఎలాంటి పన్నీర్ తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. పన్నీర్ శరీరానికి ఆరోగ్యకరమే, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే అది అనారోగ్యానికి దారితీయవచ్చు.
పన్నీర్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పన్నీర్ అనేది ముఖ్యంగా శాకాహారులకు ఒక అద్భుతమైన పోషకాహారం. దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో అధిక ప్రోటీన్ వుంది. ఫలితంగా కండరాల బలానికి, కణాల మరమ్మతుకు, శరీర ఎదుగుదలకు పన్నీర్‌లో ఉండే క్వాలిటీ ప్రోటీన్ బాగా ఉపయోగపడుతుంది. పన్నీర్ లోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు, పళ్ళు బలంగా ఉండటానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఆహారం, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచదు.
కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
పన్నీర్ తయారీకి ఉపయోగించే పాలను బట్టి దాని ప్రభావం ఉంటుంది. ఫుల్-క్రీమ్ మిల్క్ పన్నీర్.. అంటే వెన్న తీయని పాలుతో చేసిన పన్నీర్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ లేదా ఎక్కువ మొత్తంలో తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరిగే అవకాశం ఉంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. లో-ఫ్యాట్ లేదా స్కిమ్డ్ మిల్క్ పన్నీర్.. అంటే వెన్న తీసిన పాలతో చేసే పన్నీర్‌లో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో సురక్షితం.
ఆరోగ్యంగా ఉండటానికి పన్నీర్ ఎలా తినాలి?
ఇప్పటికే హై కొలెస్ట్రాల్, బీపీ లేదా గుండె జబ్బులు ఉంటే, మార్కెట్లో దొరికే 'లో-ఫ్యాట్ పన్నీర్' లేదా ఇంట్లోనే టోన్డ్ మిల్క్‌తో చేసిన పన్నీర్‌ను వాడాలి. పన్నీర్‌ను నూనెలో డీప్ ఫ్రై (Deep Fry) చేయడం వల్ల క్యాలరీలు, కొవ్వులు విపరీతంగా పెరుగుతాయి. అలా కాకుండా లైట్‌గా గ్రిల్ చేయడం, బేక్ చేయడం లేదా తక్కువ నూనెతో కర్రీస్ చేసుకోవడం మంచిది. ఏదైనా పరిమితంగా తింటేనే ఆరోగ్యం. రోజువారీ ఆహారంలో 50 నుండి 60 గ్రాముల పన్నీర్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.
