శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 మార్చి 2018 (13:25 IST)

అలా మాట్లాడొద్దు.. శ్రీదేవి కోసం ఎంతో కష్టపడింది : బాబాయ్ వేణుగోపాల్

నటి శ్రీదేవి వల్ల ఆమె తల్లి అనేక కష్టాలు పడిందంటూ మీడియాలో వస్తున్న కథనాలపై శ్రీదేవి బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శ్రీదేవిని నటిగా చేయడానికి ఆమె తల్లి ఎంతగానో కష్టప

నటి శ్రీదేవి వల్ల ఆమె తల్లి అనేక కష్టాలు పడిందంటూ మీడియాలో వస్తున్న కథనాలపై శ్రీదేవి బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి స్పందించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, శ్రీదేవిని నటిగా చేయడానికి ఆమె తల్లి ఎంతగానో కష్టపడిందని చెప్పారు. అదేమయంలో శ్రీదేవి నటిగా నిలదొక్కుకున్న తర్వాత తల్లిని ఏనాడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చింది. ఎందుకంటే శ్రీదేవికి తన తల్లి అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. 

శ్రీదేవి అంతకుముందు తన చెల్లెలికి సాయం చేసిందనీ, అలాగే, మనస్పర్థలు తొలగిన తర్వాత కూడా చెల్లెలికి కావలసినవి అన్ని ఏర్పాట్లూ చేసిందని చెప్పారు. అలాగే, మేం ఇల్లు కట్టుకుంటున్నాం అని తెలిసి, చెన్నై నుంచి ఏసీ మెషీన్లు, మార్బుల్స్‌ను శ్రీదేవి పంపించిందని, అలా మాకు కూడా ఆమె అడక్కుండానే సాయం చేసిందని ఆయన వివరించారు. 
 
కాగా, శ్రీదేవి చిన్నప్పటి నుంచి ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డికి బాగా తెలుసు. ఆ రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధం వుంది కూడా. శ్రీదేవి బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించడం దగ్గర నుంచి.. ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదగడం వరకూ ప్రత్యక్షంగా చూసిన శ్రీదేవి కుటుంబ సభ్యుల్లో వేణుగోపాల్ ఒకరు. కాగా, గత నెల 24వ తేదీన శ్రీదేవి దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన విషయం తెల్సిందే.