1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Vampires Movie: Samantha Out, Rashmika In

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

Rashmika Mandanna
బాలీవుడ్ హారర్ కామెడీ వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్‌లో నటించే అవకాశాన్ని రష్మిక మందన్న సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత సమంత ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె స్థానంలో రష్మిక ఆ ఛాన్సును కైవసం చేసుకుందని బిటౌన్ వర్గాల టాక్.
 
ఈ చిత్రానికి నిర్మాత దినేష్ విజన్. ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణను ప్రారంభించనుంది. ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి వుంది. ఇందులో సమంత కోసం తొలుత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
యానిమల్ విజయం తర్వాత, రష్మిక చేతిలో ఛావా, సల్మాన్ ఖాన్ సికందర్ వంటి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లు చేస్తుండటంతో సమంతను పక్కనబెట్టి రష్మికను ఇందులో తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో, రష్మిక పాన్-ఇండియా చిత్రం పుష్ప 2లో నటిస్తోంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌