శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 23 జూన్ 2024 (13:04 IST)

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

Samantha to romance Shah Rukh Khan
Samantha to romance Shah Rukh Khan
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కి హీరోయిన్ సమంత చాలా పెద్ద ఫ్యాన్. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌ మరో సినిమా చేయబోతున్నారట. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే నిజమైతే రాజ్‌కుమార్ హిరానీతో సమంతకి ఇదే తొలి సినిమా అవుతుంది. షారుఖ్ ఖాన్‌కి మాత్రం ఇది హిరానీతో రెండో చిత్రం. గతేడాది వీరి కాంబోలో వచ్చి 'డంకీ' చిత్రం మంచి హిట్ అయింది. 
 
ఈ భారీ మూవీకి ఇంకా టైటిల్‌ని ఖ‌రారు చేయాల్సి ఉంది. షారూఖ్ బ్యాక్ టు బ్యాక్ హిరాణీతో క‌లిసి ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. షారుఖ్ త‌దుప‌రి సుహానాతో క‌లిసి కింగ్ అనే మాఫియా నేప‌థ్య‌ చిత్రంలో న‌టించాల్సి ఉంది. స‌మంత న‌టించిన సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ హ‌నీబ‌న్ని విడుద‌ల కావాల్సి ఉంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.