బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 15 జూన్ 2024 (18:32 IST)

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ హిందీ వెర్షన్

Vijay Devarakonda, Rashmika
Vijay Devarakonda, Rashmika
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా హిందీ వెర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా 400 మిలియన్స్ కు పైగా వ్యూస్ తో దూసుకెళ్తోంది. గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానెల్ 2020, జనవరి 19 డియర్ కామ్రేడ్ మూవీ హిందీ వెర్షన్ ను అప్ లోడ్ చేసింది. ఈ సినిమా 150 భాషల్లో సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉండటం విశేషం.
 
ఈ సినిమాకు యూట్యూబ్ లో వస్తున్న వ్యూస్ పాన్ ఇండియా స్థాయిలో విజయ్ దేవరకొండ సినిమాలకు దక్కుతున్న ఆదరణను, హీరోగా విజయ్ క్రేజ్ ను చూపిస్తున్నాయి. బిగ్ బెన్ సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా డియర్ కామ్రేడ్ సినిమాను రూపొందించాయి. భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది డియర్ కామ్రేడ్ మూవీ.