మంగళవారం, 1 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 మే 2024 (19:09 IST)

రష్మిక మందన్నతో వైరల్ కావాలనే అలా చేశాం : ఆనంద్ దేవరకొండ

Rashmika Mandanna  Anand Deverakonda
Rashmika Mandanna Anand Deverakonda
గం..గం..గణేశా ప్రీ రిలీజ్ లో  రష్మికను ఆనంద్ మా ఫామిలీ ఫ్రెండ్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.  అది వైరల్ అయింది. దీనిపై ఈరోజు ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.  రశ్మిక మా  ఫ్యామిలీ ఫ్రెండ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఛిట్ ఛాట్ వైరల్ కావాలనే చేశాం. "గం..గం..గణేశా"కు చేతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది.  హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ నా హోమ్ బ్యానర్ లాంటిది. కేదార్, వంశీ నా ఫ్రెండ్స్. ఈ సినిమా కోసం వాళ్లు ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ డిలేస్, సెట్ పాడయినప్పుడు మళ్లీ ఖర్చు పెట్టి సినిమా కంప్లీట్ చేశారు.
 
- నాకు రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం. ధనుష్ కర్ణన్, అసురన్ మూవీస్ లా సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు వినోద్ అనంతోజు  సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబోలో చేస్తున్న మూవీ అలాంటి ఫార్మేట్ లోనే ఉంటుంది. డైరెక్టర్ సాయి రాజేశ్, ఎస్ కేఎన్, వైష్ణవి, నేను కలిసి బేబి కాంబోలో ఓ మూవీ చేస్తున్నాం. వీటితో పాటు స్టూడియో గ్రీన్ వారి డ్యూయెట్ సినిమాలో నటిస్తున్నా. ఈ సినిమా 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది అన్నారు.