విజయ్ దేవరకొండ అమెరికా టూర్ కు హ్యూజ్ రెస్పాన్స్
Vijay Devarakonda with America fans
హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అమెరికా టూర్ లో ఉన్నారు. ఈ పర్యటనకు విజయ్ ఫాదర్ గోవర్థన్, మదర్ మాధవి, సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా వెళ్లారు. విజయ్ దేవరకొండ యూఎస్ టూర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు రావడం పట్ల అక్కడి తెలుగువారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ను కలిసేందుకు, ఆయనతో కలిసి ఫొటోస్ తీసుకునేందుకు తెలుగువారు పోటీపడ్డారు. ఆమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ కు ఈ టూర్ నిదర్శనంగా నిలుస్తోంది.
అమెరికా తెలుగు ఆసోసియేషన్ (ఆటా) ఏర్పాటు చేసిన ఈవెంట్ గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. శ్రీముఖి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించింది. ఆ తర్వాత వుమెన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కు కూడా విజయ్ దేవరకొండ అతిథిగా వెళ్లారు. ఆటా ఈవెంట్ లో విజయ్ హీరోగా నటించిన సినిమాలతో పాటు ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ పోస్టర్స్ ప్లే చేశారు.
ఆటా కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ఆటా ఈవెంట్ కు గెస్ట్ గా రావడం సంతోషంగా ఉంది. ఇక్కడి మన తెలుగువాళ్లను కలుసుకుని మాట్లాడటం హ్యాపీ ఫీల్ కలిగిస్తోంది. వాళ్లు నాపై చూపిస్తున్న లవ్ అండ్ అఫెక్షన్ కు థ్యాంక్స్. మన తెలుగువారు చదువుల కోసం, ఉద్యోగాల కోసం యూఎస్ వచ్చారు. ప్రస్తుతం రెసిషన్ టైమ్ నడుస్తోంది. మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి. తమ పిల్లల కోసం అమెరికా వచ్చిన అత్తమ్మలు, మామయ్యలకు కూడా హాయ్ చెబుతున్నా. అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో విజయ్ దేవరకొండ అమెరికా టూర్ సందడిగా సాగుతోంది. విజయ్ యూఎస్ టూర్ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.