గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 మే 2024 (14:45 IST)

పోలింగ్ బూత్‌లో బురఖా ధరించిన మహిళలు.. మాధవి లత అలా?

Madhavi Latha
Madhavi Latha
హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కె మాధవి లత పోలింగ్ బూత్‌లో బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో మసీదుపై విల్లు ఎక్కుపెట్టిన మాధవీలత వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బురఖా ధరించిన మహిళల వద్ద ఐడీ కార్డులను చెక్ చేసిన వీడియో వైరల్ కావడంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 
 
హైదరాబాద్‌లో మాధవీ లత, ఒవైసీలు తలపడుతున్నారు. అమృత విద్యాలయంలో స్వయంగా ఓటు వేసిన తర్వాత అనేక పోలింగ్ బూత్‌లను సందర్శించిన లత, అజంపూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఆగి, అక్కడ ఓటు వేయడానికి వేచి ఉన్న మహిళల ఐడిలను తనిఖీ చేయడం ప్రారంభించించారు. ఒక వీడియోలో, ఆమె బురఖా ధరించిన స్త్రీని తన ముసుగును ఎత్తమని అడగడాన్ని చూడవచ్చు. ఆపై ఐడీ కార్డులను కూడా తనిఖీ చేయడం వివాదానికి తావిచ్చింది.