1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : ఆదివారం, 12 మే 2024 (22:03 IST)

షాకింగ్, బుల్లెట్ మోటార్‌కి మంటలు, ఆర్పుతుండగా పేలుడు, ఆరుగురికి తీవ్ర గాయాలు - live video

bullet motor caught fire
హైదరాబాదులో ఆదివారం సాయంత్రం మొఘల్‌పురా వద్ద ఘోర ఘటన చోటుచేసుకున్నది. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగా బుల్లెట్ మోటార్‌సైకిల్‌లోని ఇంధన ట్యాంక్ పేలడంతో ఒక పోలీసు సహా ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జంట మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మైమర్ చికెన్ సెంటర్ బీబీ బజార్ రోడ్డు సమీపంలో వాహనం నుంచి మంటలు చెలరేగాయి.
 
దంపతులు ద్విచక్రవాహనం నుంచి కిందకు దిగారు. స్థానికులు గుమిగూడి సమీపంలోని దుకాణం నుంచి తెచ్చిన నీటిని ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. నీళ్లు, గోనె సంచులను ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా, ట్యాంక్ అకస్మాత్తుగా పేలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మోటార్ సైకిల్ పేలుడు ఘటనలో పార్క్ చేసిన మరో రెండు మోటార్‌సైకిళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల కారణంగా దుకాణం కూడా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.