సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2024 (17:03 IST)

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

victim
మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ శృంగార కుంభకోణానికి సంబంధించిన వీడియోలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌లో ప్రభుత్వ అధికారులు సహా దాదాపు 3 వేల మంది మహిళల సెక్స్ వీడియోలు ఉండటం, ఆ వీడియోలు బయటకు రావడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ జర్మనీ పారిపోయినట్టు కథనాలు వస్తున్నాయి. తాజాగా ఇపుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బీజేపీ పెద్దలకు ముందే తెలుసన్న విషయం బయటపడింది. 
 
గత యేడాది డిసెంబరు 8వ తేదీన బీజేపీ నేత దేవరాజె గౌడ.. రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రకు లేఖ రాస్తూ ప్రజ్వల్ సహా దేవెగౌడ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్ పెన్ డ్రైవ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు సహా 2976 మంది మహిళల అశ్లీల వీడియోలు ఉన్నట్టు తెలిపారు. వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక చర్యలకు పాల్పడ్డారాని ఆరోపించారు. మరో పెన్ డ్రైవ్‌లో మహిళల అశ్లీల చిత్రాలు ఉన్నాయని, అవి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోని జాతీయ స్థాయి నేతలకు చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత రేవణ్ణ ఇంటిలో పనిచేసే 47 ఏళ్ల మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. రేవణ్ణతోపాటు ఆయన తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ తనను లైంగికంగా హింసించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.