శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. లోక్ సభ ఎన్నికలు 2024
Written By PNR
Last Updated : సోమవారం, 18 మార్చి 2024 (16:56 IST)

రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తే ఎమ్మిగనూరు టిక్కెట్ ఇస్తామన్నారు : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్

sanjeev kumar
ఇటీవల అధికార వైకాపాకు రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్ల తనకు ఎంపీ టిక్కెట్ కాకుండా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని ప్రతిపాదన చేశారన్నారు. అయితే, వైసీపీలో ఉండి రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఇస్తేనే ఎమ్మిగనూరు టిక్కెట్ ఇస్తామని చెప్పారని వివరించారు. తనకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి మధ్య డబ్బు పోటీ పెట్టారన్నారు. 
 
అయితే, తన వద్ద అంత డబ్బు లేదని చెప్పి గౌవరంగా ఆ పార్టీ నుంచి దూరంగా వచ్చినట్టు చెప్పారు. మరి వైకాపాలో ఎమ్మిగనూరు టిక్కెట్ దక్కించుకున్నవారు వైకాపా అధిష్టానికి ఎంత మేరకు కప్పం కట్టారో తనకు తెలియదన్నారు. బీసీలకు బీసీల మధ్య, ఎస్సీలకు ఎస్సీల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి విచ్ఛిన్నకర రాజకీయాలు ఒక్క వైకాపాలో చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
పీఠాపురం నుంచి జనసేనాని పోటీ : స్వయంగా వెల్లడించిన పవన్ కళ్యాణ్ 
 
ఏపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఏదో తేలిపోయింది. ఆయన పీఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు గురువారం స్వయంగా ప్రటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆయన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. దీనికి ఆయన తెరదించారు. పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు గురువారం స్వయంగా ప్రకటించారు. అలాగే, ప్రస్తుతానికి తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
గత 2014లో పార్టీ స్థాపించగానే పిఠాపురం నుంచి పోటీ చేయాలని చాలా మంది అడిగారన్నారు. తెలంగాణ నుంచి, పిఠాపురం నుంచి పోటీచేయమంటూ తనకు వినతులు వచ్చాయన్నారు. అయితే, రాష్ట్రం కోసం ఆలోచించి అపుడు పిఠాపురం నుంచి పోటీ చేయలేకపోయానని చెప్పారు. నిజంగా చెప్పాలంటే ఎన్నికల గురించి తాను ఎపుడూ ఆలోచించలేదని, అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నిలబడదామని అనుకున్నానని, అందుకే 2014లో పార్టీ ఆఫీస్‌ను కూడా అక్కడ నుంచి ప్రారంభించానని చెప్పారు.