1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (23:22 IST)

వైసీపీ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాజీనామా

ysrcp flag
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ మరో నేతను కోల్పోయింది. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు తన ఎంపీ పదవికి కూడా సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. తాజాగా వైసీపీ అధిష్టానం ఆయనను కర్నూలు పార్లమెంట్ స్థానానికి ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించింది. 
 
ఈ కారణంగానే మనస్తాపం చెంది రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ సంజీవ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన అనుచరులు, మద్దతుదారులు, బంధువులతో చర్చించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 
 
బుధవారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని, ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు.