బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మే 2024 (19:16 IST)

పిఠాపురంలో పవన్ సీటుకే దిక్కులేదు.. ఇక నా కుమార్తెకు సీటు ఇస్తారట!! ముద్రగడ ఎద్దేవా

pawan - mudragada
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోమారు మాటల దాడి చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సీటుకే దిక్కులేదు.. ఇక నా కుమార్తె ముద్రగడ క్రాంతికి సీటు ఇస్తారంటా అంటూ ఎద్దేవా చేశారు. తుని వేదికగా జరిగిన వారాహి విజయ యాత్రలో భాగంగా తునిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం కుమార్తె ముద్రగడ క్రాంతి, ఆమె భర్త చంద్రులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, మళ్లీ జరిగే ఎన్నికల్లో తన సోదరి క్రాంతికి టిక్కెట్ ఇస్తానని ప్రకటించారు. అలాగే, తండ్రి ముద్రగడ పద్మనాభం, కుమార్తె ముద్రగడ క్రాంతిలను కలుపుతానని చెప్పారు. దీనపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. పవన్‌పై ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ సీటుకే దిక్కు లేదని, తన కుమార్తెకి టిక్కెట్ ఇస్తారంటూ అంటూ ఎద్దేవా చేశారు. 
 
భీమవరం, గాజువాకలో పవన్‌ను తన్ని తరిమేశారని, ఇపుడు పిఠాపురంలో కూడా అదే జరగబోతుందని ముద్రగడ అన్నారు. చంద్రబాబు ఎస్టేట్‌‍లో మార్కెటింగ్ మేనేజర్ పవన్ కళ్యాణ్ అని సెటైర్ వేశారు. మెగా ఫ్యామిలీ చరిత్ర ఏమిటో పవన్ చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేశారు. గురువు చంద్రబాబు ఆజ్ఞ ప్రకారం పవన్ నడుచుకుంటున్నారని విమర్శించారు. పవన్ చెప్పేదంతా సొల్లు అని అన్నారు. కులాలు, కుటుంబాల మధ్య చిచ్చుపెట్టాలని మీ గురువు చెప్పారా అని పవన్‌ను ముద్రగడ ప్రశ్నించారు.