సినీ పరిశ్రమకు కూటమంటే భయమా: నట్టికుమార్ - జగన్ పాలనా బాగానే ఉంది : నాగార్జున
"తెలుగు సినీ పరిశ్రమలో అధికశాతం మహాకూటమి అనుకూలురు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సమయంలో వారు ఎందుకు బయటకు రాలేకపోతున్నారో ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఒకవేళ తాము బయటపడితే జగన్ రెడ్డి ఏం చేస్తారోనన్న భయం వారికి ఉన్నట్లుంది.
రాజధాని లేక,, యువతకు ఉద్యోగాలు రాక అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం కోసం సినీ పరిశ్రమలోని మహాకూటమి అనుకూలురు అంతా స్వచ్ఛందంగా ముందుకువచ్చి, కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి" అని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఆయన మాట్లాడుతూ, సినీ పరిశ్రమ ను జగన్ రెడ్డి బయపెడుతుండటం వల్లే కూటమికి బహిరంగంగా సపోర్ట్ చేసేందుకు బయటపడలేకపోతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడైనా దీని గురించి సినిమావారు మాట్లాడాలి.. ఎక్కడినుంచో ఎన్నారై లు వచ్చి తమ సొంత ఊర్లలో చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ సినిమా వారు మాత్రం ఎందుకు బయటకు రావడం లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. జూనియర్ ఎన్టీఆర్ కూడా సపోర్ట్ చేయాలి అన్నారు.
దీనికి నాగార్జున స్పందిస్తూ, సినిమా వాళ్ళం హైదరాబాద్ లో వుంటూ ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడడం సరికాదు. నన్ను టి.డి.పి. తరఫున మాట్లాడమని ఒత్తిడి తెచ్చారు. అక్కడ జగన్ గారి ప్రభుత్వం బాగానే వుంది. అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవరూ మాట్లాడడంలేదు అని నాగార్జున బదులిచ్చారు.