సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

పట్టించుకోని ప్రభుత్వం... పింఛన్ల పంపిణీలో సమస్యలు... బ్యాంకుల్లో జమకానివారికి...

cash
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ రసాభాసగా మారింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది. దీంతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. పైగా, ప్రతిపక్షాల వల్లే వాలంటీర్లను పంపిణీ చేయలేకపోతున్నామంటూ దుష్ప్రాచారం చేస్తూ, లబ్ధిదారుల్లో సానుభూతిపొంది ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న తపనతో ఉంది. దీంతో రెండో తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన పింఛన్లు సక్రమంగా పంపిణీ కావడం లేదు. ఈ కారణంగా లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. 
 
అయితే, అధికారులు మాత్రం బ్యాంకు ఖాతాలు గలిగిన వారిరి ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు. కానీ, అది ఆచరణలో సాధ్యంకావడం లేదు. దీంతో బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వెల్లడించారు. 
 
ఇప్పటివరకు 74,399 మంది పింఛనుదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకానట్లు గుర్తించామన్నారు. వీరందరికీ ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీరి జాబితాను శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. మొత్తం 65.49 లక్షల మందికిగాను 63.31 లక్షల(96.67 శాతం) మంది పింఛనుదారుల ఖాతాల్లో నగదు జమ చేశామని తెలిపారు.