సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 మే 2024 (14:12 IST)

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ys sharmila
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నవ సందేహాలతో ఓ బహిరంగ లేఖ రాశారు. మొత్తం తొమ్మిది ప్రశ్నలను సంధించిన ఆమె.. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. దళిత డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. 
 
అంతేకాకుకుండా, సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌ నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? అని చెప్పారు. 
 
ఎస్టీ ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిపోయింది? ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు ఎందుకు నిరాకరించారు? స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు? డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యీ అనంతబాబుకు ఎందుకు సమర్థిస్తున్నారు? అంటూ షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి పదేపదే ప్రస్తావిస్తుండటంతో షర్మిల ఇపుడు నవ సందేహాలతో నవ ప్రశ్నలను సంధించారు.