శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 27 ఏప్రియల్ 2024 (20:18 IST)

పాత మేనిఫెస్టోలోని మద్యపాన నిషేధమే అమలుచేయలేదు, ఇంక కొత్తదా?: వైఎస్ షర్మిల

YS Sharmila
కొత్త మేనిఫెస్టో సంగతి అంట్లుంచండి. గత ఐదేళ్ల నాడు ఇదేవిధంగా జగనన్న మైకు బట్టుకుని రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం, అలా చేస్తేనే మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతాం అని అన్నారు. చేసారా అన్నా అంటూ వైఎస్ షర్మిల విమర్శలు సంధించారు.
 
సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్లు ఏది అమ్మితే అదే కొనాలట. నాసిరకం మందు, ఈ లిక్కర్ తాగి 25 శాతం మంది లివర్, కిడ్నీలు చెడిపోయి చనిపోతున్నారు. మద్యం అమ్మకాలు చేసేటపుడు సేల్స్ ట్యాక్స్ లేదు, ఒక పద్ధతి లేదూ పాడూలేదు. జనం ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు.
 
గత మేనిఫెస్టోలో డీఎస్సీ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, రాజధాని అన్నారు.. ఒక్కటైనా అయ్యిందా అన్నా. ప్రజలు నమ్మి ఐదేళ్లు అధికారంలో ఇస్తే..హోదా తెచ్చారా ? రాజధాని కట్టారా.. ? పోలవరం కట్టారా?.. రాష్ట్రానికి హోదా రావాలి అంటే జగన్ దిగాలి.. కాంగ్రెస్ అధికారంలో రావాలి. పోలవరం కట్టాలి అంటే కాంగ్రెస్ కావాలి.. జగన్ దిగాలి. రాజధాని నిర్మించాలి అంటే కాంగ్రెస్ రావాలి.. జగన్ అధికారం నుంచి దిగాలి. రాష్ట్రాన్ని తన మాయ మాటలతో నిలువునా మోసం చేసినా ఈ జగన్ మోహన్ రెడ్డి మనకి అవసరమా? అందుకే హస్తం గుర్తుకు ఓటు వేయండి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం అంటూ చెప్పారు వైఎస్ షర్మిల.