శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 24 మార్చి 2024 (13:40 IST)

మందు బాబులకు చేదువారం.. 25న మందు షాపులు బంద్.. ఎక్కడ?

liquor
జంట నగరాల్లోని మందు బాబులకు సర్కారు చేదువార్త చెప్పింది. హోళీ పండుగను పురస్కరించుకుని జంట నగరాల్లోని అన్ని వైన్ షాపులు మూతపడనున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు పోలీసులు ఆదేశాలు జారీచేశారు. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ షాపులు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. అయితే, నక్షత్ర హోటళ్లు, రిసార్ట్స్‌లకు మాత్రం ఈ ఆదేశాలు వర్తింవచని పేర్కొన్నార. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 25వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. హోలీ వేడుకల్లో ఎటువంటి అంవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా, ఇతరులకు ఇబ్బందులు లేకుండా చూసే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పోలీసుు పేర్కొన్నారు. అలాగే, హోళీ సంబరాల్లో భాగంగా, రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకుంటూ వచ్చీపోయే వారికి ఇబ్బంది కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, వాహనాల్లో గుంపులుగా వచ్చి ప్రయాణించవద్దని సూచించారు.