ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 మార్చి 2024 (11:06 IST)

లాలాపేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ.. వ్యక్తి అరెస్ట్.. 1,300 కేజీలు స్వాధీనం

హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈస్ట్‌ జోన్‌ బృందం శుక్రవారం సికింద్రాబాద్‌ లాలాపేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ యూనిట్‌పై దాడి చేసింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 1,300 కిలోల కల్తీ పేస్ట్, 20 కిలోల టైటానియం డయాక్సైడ్, శాంతమ్ గమ్ మొత్తం రూ.1.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితుడు నీలా వెంకటేశ్వర్లు (54) టైటానియం డయాక్సైడ్, శాంతమ్ గమ్ కలిపి అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ దొరికిపోయాడు. అతనిపై 2019లోనూ కేసులున్నాయి. 
 
నిందితుడు నగరంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరఫరాదారు, బ్రాండెడ్ డెలివరీ చేసేవాడు. సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లోని తన నివాసంలో రసాయనాలు వాడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేసి దొరికిపోయాడు.