శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (09:07 IST)

బొందిలో ప్రాణమున్నంత వరకు బెంగాల్‌లో సీఏఏ అమలు కాదు : సీఎం మమతా బెనర్జీ

mamata benargi
తన బొందిలో ప్రాణం ఉన్నంతవరకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు కానివ్వబోనని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. దేశంలో సీసీఏ అమలుకు కేంద్రం చర్యలు చేపట్టింది. మరో వారం రోజుల్లో సీసీఏను అమలు చేస్తామంటూ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. దీనిపై మమతా బెనర్జీ స్పందించారు. 
 
రాజకీయ అవకాశవాదంతో భారతీయ జనతా పార్టీ సీసీఏ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తుందన్నారు. ఎవరి పౌరసత్వాన్ని లాక్కొనిపోయేందుకు అనుమతించేది లేదన్నారు. సీఏఏ, ఎన్ఆర్‌సీ, ఉమ్మడి పౌరస్మృతి వంటి అంశాలను బీజేపీ ఇపుడు చెప్పడం పూర్తిగా రాజకీయమేనన్నారు. బెంగాల్‌ సరిహద్దుల్లో ఉంటున్నవారందరికీ తాము పౌరసత్వం ఇచ్చామని, వారు ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు అన్ని ప్రయోజనాలు పొందగలుగుతున్నారని చెప్పారు.
 
సరిదద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి బీఎస్ఎఫ్ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తుందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అలాంటి కార్డులు స్వీకరించవద్దని హెచ్చిరంచారు. ఎన్ఆర్సీ ఉచ్చులో పడవేసేందుకు అవి సాధానాలు అవుతాయని చెప్పారు. అందువల్ల తాను బతికున్నంత వరకు బెంగాల్ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం అమలు కానివ్వబోనని స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలోనే బీజేపీ సీఏఏ పల్లవి అందుకుందని ఆమె ఆరోపించారు.