బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (12:14 IST)

ఒకే వేదికపై స్టెప్పులేసిన పశ్చిమ బెంగాల్ సీఎం- సల్మాన్ ఖాన్

Salman Khan_Mamata
Salman Khan_Mamata
29వ కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ప్రారంభ వేడుక మంగళవారం కోల్‌కతాలో జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సల్మాన్ ఖాన్ విచ్చేశారు. 
 
సల్మాన్ ఖాన్‌తో పాటు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వంటి పలువురు ప్రముఖులు కూడా KIFF 2023లో సందడి చేశారు. వీరితో పాటు, సోనాక్షి సిన్హా, అనిల్ కపూర్, శత్రుఘ్న సిన్హా, సౌరవ్ గంగూలీ, మహేష్ భట్ హాజరయ్యారు. 
 
సల్మాన్ ఖాన్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకే వేదికపై స్టెప్పులు వేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాయకుడు అరిజిత్ సింగ్ పాడిన పాటకు మమతా బెనర్జీ డ్యాన్స్ చేసి చిత్రోత్సవంలో ఉత్సాహాన్ని నింపారు.