గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (18:30 IST)

పాపాలు చేసినవారిని తొక్కిపడేయండి : షర్మిల భర్త అనిల్ పిలుపు

brother anil
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు అత్యంత కీలకంగా మారాయి. కడప జిల్లా రాజారెడ్డి వీధిలోని కృపా చర్చలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నరు. పాపాలు చేసిన వారిని తొక్కిపడేయాలని పిలుపునిచ్చారు. పాపులను తరిమికొట్టాలంటే ప్రార్థన ఒక్కటే సరిపోదన్నారు. ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎవరికీ భయపడకండి.. ఏసు ప్రభువు అండగా ఉన్నాడు అని ఆయన ఉద్బోధించారు. దైవునిపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోండి అని పిలుపునిచ్చారు. 
 
సీఎం జగన్‌ సినిమాల్లో నటిస్తే 'భాస్కర అవార్డు' వచ్చేది : నారా లోకేష్ 
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ రెడ్డి అద్భుతమైన నటుడన్నారు. ఆయన సినిమాల్లో నటిస్తే ఆయనకు భాస్కర్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. 
 
ఆదివారం మంగళగిరిలోని నీరుకొండలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొని మాట్లాడుతూ, జగన్ నటన గురించి దర్శకుడు రాజమౌళికి ఫోన్ చేసి చెబుతానని, భాస్కర్ అవార్డు అందుకునే స్థాయిలో నటిస్తున్న జగన్‌తో ఓ సినిమా చేయాలన కోరతానని అన్నారు. దీంతో అక్కడున్న జనంతో నవ్వులు విసిరారు. జగన్‌కు తాకిన ఆ గులకరాయికి మ్యాచ్ వచ్చని వ్యంగ్యంగా విమర్శించారు. 
 
తొలుత జగన్‌కు తాకిన ఆ గులకరాయి అక్కడితో ఆగక పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌ను తాకిందని, ముందు ఎడమ కంటికి తాకి ఆపై తలచుట్టూ తిరిగి కుడికన్నును కూడా గాయపరిచడం మ్యాజిక్ కాక మరేంటని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో సీఎం జగన్‌తో పాటు  వైకాపా నేతలు బిల్డప్ ఇచ్చారంటూ లోకేశ్ సెటైరికల్‌గా స్పందించారు.