గురువారం, 3 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2024 (19:29 IST)

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

kcrcm
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రమాదం తప్పింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తోన్న కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ సమయంలో వేములపల్లి వద్ద ప్రమాదం జరిగింది.
 
నల్గొండ జిల్లా వేములపల్లి శివారులో కేసీఆర్ కాన్వాయ్ ప్రమాదానికి గురికావడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు షాక్ అయ్యారు. వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
ఓ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు వెల్లడించారు. దాదాపు అన్ని కార్ల బ్యానెట్లు దెబ్బతిన్నాయని వారు తెలిపారు.