1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (14:02 IST)

పవన్ కళ్యాణ్ భీమవరం సభలో కత్తి కలకలం.. ఇద్దరు వ్యక్తుల అరెస్టు!!

Pawan Kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఓ కత్తి కలకలం చెలరేపింది. ఈ సభలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేశారు. వారిలో ఒకరి నుంచి చాకును స్వాధీనం చేసుకున్నారు. ఈ దండగులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై దాడి చేసేందుకు యత్నించారు. 
 
వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆదివారం వారాహి యాత్రను నిర్వహించారు. ఈ సభలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, వారిలో ఒకరి నుంచి చాకును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, వారిలో ఒకరు పోలీసులపైనే దాడి చేశారు. 
 
చివరకి టూ టౌన్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారు జేబు దొంగలా లేదంటే పవన్ కళ్యాణ్‌‌పై దాడి కోసమే వచ్చారా అన్న కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నిందితులిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని, వారిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు.