బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (19:04 IST)

బీజేపీ నేత మాధవి లతకు కరచాలనం, ఆలింగనం- ASI సస్పెండ్

Woman ASI
Woman ASI
బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ స్థానం అభ్యర్థి కె. మాధవి లతను ఆలింగనం చేసుకున్న అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ ఉమాదేవి మాధవి లతతో కరచాలనం చేస్తూ, ఆమెను ఆలింగనం చేసుకోవడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో బీజేపీ నాయకుడు ప్రచారం చేస్తున్నప్పుడు విధుల్లో వున్న పోలీస్ ఆఫసర్ ఇలా చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుంది. దీంతో ఆ పోలీసు అధికారిని పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు.
 
ఇకపోతే... మాధవి లత గత వారం రామ నవమి నాడు చేపట్టిన ఊరేగింపులో మసీదుపై బాణం విసిరినట్లు రెచ్చగొట్టే సంజ్ఞ చేయడం కలకలం రేపింది. ఆమె రెచ్చగొట్టే సంజ్ఞ ద్వారా ఒక సమాజంలోని మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
 
 షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆమెపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెపై సెక్షన్ 295-A, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 కింద కేసు నమోదు చేయబడింది.