1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (12:42 IST)

కొత్త హీరోతో అనుష్క శెట్టి రొమాన్స్ - లేటెస్ట్ అప్ డేట్

Anushka Shetty
Anushka Shetty
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కొంతకాలం క్రితం వచ్చిన మిస్టర్, మిసెస్ పోలిశెట్టితర్వాత తను మరో చిత్రాన్ని చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమా కూడా యువి క్రియేషన్స్ బేనర్ లో రూపొందుతోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీలో అనుష్క షూటింగ్ షురూ అయింది. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 
 
ఇక ఈ సినిమాకు దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాక్రిష్న) దర్శకుడు. వేదం సినిమా తర్వాత అనుష్కతో క్రిష్ చేస్తున్న సినిమా ఇది. వేదంలో వేశ్య పాత్రలో అనుష్క నటించింది. కాగా, ఈ సినిమాలో తమిళనటుడు ప్రభు కుమారుడు హీరోగా నటించడం విశేషం. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయడానికి యువి క్రియేషన్స్ సన్నాహాలు చేస్తుంది.