ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (10:52 IST)

మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన అనుష్క శెట్టి.. బరువు తగ్గిన స్వీటీ

Anushka shetty
Anushka shetty
బాహుబలి హీరోయిన్ అనుష్క శెట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. బాహుబలి తర్వాత చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో అలరించింది. అయితే అనుష్క శెట్టి కొన్నాళ్ల పాటు మీడియాకు దూరంగా వుంది. ఆ మధ్యలో బరువు కారణంగా అనుష్క పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందని.. దాని కారణంగానే సినిమాలకు దూరంగా ఉందంటూ రూమర్లు పుట్టుకొచ్చాయి. 
 
ఇక తాజాగా మీడియాకు దర్శనమిచ్చింది.  తాజాగా అనుష్క శెట్టి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళంలో తను నటించిన కొత్త చిత్రం యూనిట్‌తో ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చింది. 
 
ఈ ఫోటో చూస్తే ఆమె సన్నబడింది. మళ్లీ బరువు విషయంలో ఫామ్‌కు వచ్చిందని స్వీటీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక రోజిన్ థామస్ దర్శకత్వం వహించిన మలయాళ హారర్-ఫాంటసీ డ్రామా కథనార్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తోంది.