ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (09:33 IST)

భాగమతి-2 కి సిద్దమైన అనుష్క శెట్టి

Anushka Shetty
Anushka Shetty
బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు.2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది.
 
అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా "భాగమతి-2" ని యూవీ క్రియేషన్స్ లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క త్యరలో సినిమా సెట్ పైకి రాబోతుంది.