శనివారం, 2 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (17:57 IST)

నటుడిగా పడ్డ కష్టాలు, టెంక్షన్, సవాళ్ల గురించి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హీరో నవీన్ పోలిశెట్టి ముచ్చట్లు

Naveen Polishetty
Naveen Polishetty
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాల ఘన విజయాల తర్వాత...‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో హ్యాట్రిక్ సూపర్ హిట్ అందుకున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అనుష్క శెట్టితో కలిసి ఆయన నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోనూ మంచి వసూళ్లు సాధించింది. థర్డ్ వీక్ లోనూ గ్లోబల్ గా స్టడీ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతోంది. ఆడియెన్స్ లవ్ తో పాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా అప్రిషియేషన్స్ ఈ మూవీకి దక్కాయి. ఈ నేపథ్యంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  సక్సెస్ తనకు అందించిన హ్యాపీనెస్ గురించి మీడియాతో మాట్లాడారు హీరో నవీన్ పోలిశెట్టి.
 
- మేము సెప్టెంబర్ 7 డేట్ అనౌన్స్ చేయగానే మరోవైపు జవాన్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అప్పుడు ఎంతో టెన్షన్ పడ్డా. పెద్ద సినిమాతో వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో అనే కంగారు ఉండేది. మేము మంచి సినిమా చేశాం. ప్రేక్షకులకు నచ్చుతుందని తెలుసు. కానీ సోలో గా వస్తే బాగుండేది కదా అనిపించింది. కానీ ప్రేక్షకులు మా సినిమాను సూపర్ హిట్ చేశారు. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్ తోనే అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ తెలుగులో కలెక్షన్స్ నెమ్మదిగా మొదలయ్యాయి. కానీ యూఎస్ లో డల్లాస్ లో ప్రీమియర్స్ వేసినప్పటి నుంచే స్ట్రాంగ్ గా రన్ స్టార్ట్ అయ్యింది. మూడు రోజులకే వన్ మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వీక్ లో కూడా యూఎస్ లో రన్ అవుతోంది. స్క్రీన్స్ పెంచుతున్నారు. వాస్తవంగా మూడో వారంలో యూఎస్ లో సినిమా ఉండదు.  యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లో కూడా ఆడియెన్స్ డిమాండ్ మేరకు షోస్ పెంచుతున్నారు. నేను యూఎస్ నుంచి వచ్చాక కూకట్ పల్లి , చుట్టు పక్కల ఏరియాస్ థియేటర్స్ చూశా. థర్డ్ వీక్ లో కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి.  మేము చేసిన మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా.
 
- మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ హీరోస్, టెక్నీషియన్స్ మా సినిమాను అప్రిషియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. మాతో రెండు గంటలపాటు మాట్లాడారు. నా పర్ ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మహేశ్ బాబు, రవితేజ, రాజమౌళి, చరణ్ గారు, సమంత..ఇంకా చాలా మంది చూసి వాలెంటరీగా రియాక్ట్ అయ్యారు. ఆడియెన్స్ కూడా వాళ్లకు వాళ్లే ముందుకొచ్చి మా సినిమాను ప్రమోట్ చేశారు. ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 75 సిటీస్ వెళ్లాను. అమెరికాలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు జర్నీ చేసే ఫ్లైట్ లోనే నిద్రపోయేవాడిని. హోటల్ లో నిద్ర పోయేందుకు కూడా టైమ్ ఉండేది కాదు. రిలీజ్ అయ్యాక కూడా మూవీ ప్రమోషన్ చేశాం. అది నా థ్యాంక్స్ చెప్పుకోవాడనికి వెళ్తున్నా కాబట్టి అది కష్టం అనిపించలేదు.
 
- ఇప్పటిదాకా నాకు దక్కిన మూడు సక్సెస్ ఫుల్ మూవీస్ ఒక్కోటి నా కెరీర్ కు ఒక్కో రకంగా హెల్ప్ చేశాయి. నా ఫస్ట్ మూవీకి ముందు యూట్యూబ్ వీడియోస్ చేశాను. అవి చూసి బాగున్నాయి అన్నా ఎవరూ నామీద ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రాలేదు. అలా మొదట వచ్చింది మా ఏజెంట్ సాయి శ్రీనివాస ప్రొడ్యూసర్. ఆ సినిమా నేను బాగా పర్ ఫార్మ్ చేయగలను అని ప్రూవ్ చేసింది. జాతి రత్నాలు టైమ్ లో పాండమిక్ వచ్చింది. అప్పుడు సినిమాలు థియేటర్ లో  చూడరు అన్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి...నవీన్ సినిమా థియేటర్ లో బాగా పే చేస్తుందనే నమ్మకం ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ లో వచ్చింది. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని నిరూపించుకున్నా. 
 
- ఈ సినిమాలో నా క్యారెక్టర్ కోసం బాగా ప్రిపేర్ అయ్యాను. హైదరాబాద్ తో పాటు ముంబై, యూఎస్ లో స్టాండప్ కమెడియన్స్ ను అబ్సర్వ్ చేశారు. వాళ్లు ఎలా చేస్తున్నారు ఒక టాపిక్ తీసుకుని అనేది చూశాను. అలా అబ్సర్వ్ చేయడంతో నాకొక సెన్స్ వచ్చింది ఈ క్యారెక్టర్ చేసేందుకు. బాలీవుడ్ లో స్టాండప్ కామెడీ హిట్, తమిళంలో బాగా చూస్తారు. మన దగ్గర ఎందుకు సక్సెస్ కాలేదని అనిపించింది. అయితే మనం పర్పెక్ట్ గా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని ఛాలెంజ్ గా తీసుకుని చేశాను. ఇక్కడ కూడా స్టాండప్ కామెడియన్స్ కు ఆదరణ పెరిగితే హ్యాపీ. సినిమాలు చూడకముందే చాలా మంది తమ అభిప్రాయాలు చెబుతుంటారు. కానీ చూసిన తర్వాతే సరైన రివ్యూ వస్తుందని నా నమ్మకం. అలా ఈ సినిమా బెస్ట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనే పేరు వచ్చింది. నా మొదటి సినిమా ఏజెంట్ అప్పుడు కూడా డిటెక్టివ్ సినిమాలు మన దగ్గర ఆడవు అన్నారు. ఏదైనా సక్సెస్ కాకుంటే ఎందుకు కాలేదని నేను ఆలోచిస్తా.
 
- ఈ సబ్జెక్ట్ కు స్లోగా ఓపెనింగ్స్ వస్తాయని తెలుసు. మాస్ కమర్షియల్ సినిమా అయితే ఆడియెన్స్ అలవాటు పడి ఉంటారు కాబట్టి వెళ్తారు. మేము కొత్త సెన్సిటివ్ పాయింట్ చెప్పాం. దాంతో మెల్లిగా మా మూవీ జర్నీ మొదలైంది. సినిమాలో చివరి 30 మినిట్స్ చేసిన పర్ ఫార్మెన్స్ నేను గతంలో ఎప్పుడూ ఎక్సీపిరియన్స్ చేయలేదు. ఎమోషన్, డ్రామా ప్రేక్షకులకు బాగా నచ్చాయి. నిన్న ప్రసాద్ ఐమ్యాక్స్ లో సినిమా చూశా. ఒక పెద్దావిడ 80 ఏళ్లుంటాయి. వాళ్ల అబ్బాయితో వచ్చి మూవీ చూసింది. ఆమె 15 ఏళ్లుగా సినిమాలు చూడలేదట. మా సినిమా ఆమెకు బాగా నచ్చిందని చెప్పింది. 
 
- నటుడిగా ప్రతి సీన్ ను సెట్ లో ఇంప్రొవైజ్ చేసుకుంటా. సీన్ లో నాలుగు జోక్స్ ఉంటే..నేను చేసేప్పుడు ఏడుసార్లు ఆడియెన్స్ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటా. లక్కీగా నా డైరెక్టర్స అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. సీన్ పేపర్ లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. రేపు చేసే సీన్ గురించి రాత్రే దర్శకుడితో మాట్లాడి పూర్తి క్లారిటీ తీసుకుంటా.
 
- ప్రతి భాషలో నాకు ఫేవరేట్ యాక్టర్స్ ఉన్నారు. హిందీలో అమీర్ ఖాన్ ఇష్టం. అలాగే తెలుగులో చిరంజీవి గారు, ప్రభాస్ గారు. అన్ని జానర్స్ మూవీస్ ఇష్టపడతా. హిందీలో రాజ్ కుమార్ హిరాణీ గారి మూవీస్ ఇష్టం. తెలుగులో భైరవ ద్వీపం, ఆదిత్య 369 నా ఫేవరేట్ మూవీస్. ప్రతి మూవీ సక్సెస్ నాపై హీరోగా బాధ్యత పెంచుతుంటుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. నెక్ట్ ఇయర్ మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయి. వాటి అప్ డేట్స్ నేనే మీకు చెప్తా. హిందీలో రెండు మూడు కథలు విన్నాను  కానీ నా ప్రయారిటీ ప్రస్తుతానికి తెలుగులో నటించడమే. టైమ్ దొరికితే కపిల్  షో లాంటి మంచి హ్యూమరస్ టీవీ ప్రోగ్రాం చేయడానికి రెడీ. అయితే సినిమాలతోనే టైమ్ సరిపోతోంది.