నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలతో కూడిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం రొమాంటిక్ కామెడీ. ఈ చిత్రం ట్రైలర్ ప్రచార అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెండు విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తుల నేపథ్యంలో రూపొందించారు. ఈ చిత్రంలో స్టాండప్ కామెడీని ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఈ సినిమాకి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ఈ రోజుల్లో యువత భావజాలం గురించి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని అన్నారు. ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. మరి ఎలా ఉందో చూద్దాం.
ఈ సినిమాకు దర్శకుడు మహేష్ బాబు పి. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ-ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధన్ పాటలు సమకూర్చగా, గోపీ సుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ కాగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.
కథ:
అన్వితా శెట్టి (అనుష్క శెట్టి) లండన్‌లో ఒక చెఫ్, ఆమె తండ్రి చిన్నతనంలోనే విడిపోతాడు. తల్లిని దగ్గర పెట్టుకుంటుంది. తల్లి అనారోగ్యం కారణంగా ఇండియా వస్తుంది. ఇక్కడే తన తల్లిని కోల్పోయింది. తన తల్లి జీవితంలో జరిగిన కొన్ని కారణాలు, స్నేహితురాలి జీవితంలోని సంఘటనల వల్ల అన్వితాకు పెళ్లిపై నమ్మకం పోతుంది.ఒంటరిగానే జీవించాలని డిసైడ్ అవుతుంది. ఆమె తన తల్లి మరణం తర్వాత ఒంటరిగా అనిపిస్తుంది కాబట్టి ఆమె ఒక బిడ్డను కలిగి ఉండాలని ప్లాన్ చేస్తుంది, అందుకోసం స్పెర్మ్ దాతను వెతుకుతుంది. ఆఖరికి ఔత్సాహిక స్టాండప్ కమెడియన్ అయిన సిద్ధు (నవీన్ పోలిశెట్టి)ని ఎంచుకుంటుంది. అయితే ఆమె తీసుకున్న నిర్ణయం సిద్ధూని షాక్‌కి గురిచేస్తుంది. ఆతర్వాత ఏమైంది? అనేది కథ.
సమీక్ష:
సిద్ధు పాత్రలో నవీన్ పొలిశెట్టి అద్భుతంగా నటించాడు. జాతిరత్నాలు తర్వాత మరోసారి కామెడీని ఎంచుకున్నాడు, అదే తన బలం. సరదాగా నిండిన చిత్రాన్ని అందించాడు. ప్రత్యక్ష ప్రేక్షకులతో చిత్రీకరించబడిన అతని స్టాండప్ కామెడీ షోలు బాగా పనిచేశాయి. నవీన్ పొలిశెట్టి సినిమా అంతటా ఎనర్జీని మెయింటెయిన్ చేశాడు. అన్వితా తో పరిచయం తర్వాత అటు లవ్ కాదు, ఇటు క్రైం థ్రిల్లర్ కాదు.. నా జీవితంలో ఏమి జరుగుతుంది అనే గందరగోళంలో ఉన్న వ్యక్తి గా బాగా నటించాడు.
నవీన్ పోలిశెట్టి తల్లిగా తులసి, తండ్రి మురళి శర్మ పాత్రలు కూడా అలరిస్తాయి. అనుష్క తల్లిగా జయసుధ నటించింది. తను బాలయ్య ఫ్యాన్. ఆయన సినిమాలు చూస్తూ వినోదాన్ని పంచుతుంది. చెఫ్ గా అనుష్క. .. చిరంజీవి చాయ్, బాలయ్య బిర్యాని వంటి పదాలు నవ్విస్తాయి. ఈ సినిమా చూసి చిరు మెచ్చుకోవడం అభినందనీయం.
చాలా గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి వెండితేరపై ఎప్పటిలాగే ఆకట్టుకుంది. ఆమె అన్విత అనే అధునాతన మధ్య వయస్కురాలిగా నటించింది. ఈ చిత్రంలో ఆమె భావజాలం ఇప్పుడు యువ తరాలకు బాగా దగ్గరైంది. అవసరమైనప్పుడు భావోద్వేగానికి లోనయ్యే బలమైన, స్వతంత్ర మహిళగా ఆమె పాత్ర బాగా సమతుల్యమైంది. ఇదే ఆమె పర్సనల్ అభిప్రాయమా అనే డౌట్ కూడా కలిగిస్తుంది.
ఈ సినిమా కథ చూసాక ఇది అనుష్క శెట్టి పర్సనల్ లైఫ్ అనేట్లుగా ప్రేక్షకులకు అనుమానం కలుగుతుంది. సినిమాలకు చాలా కాలం దూరంగా ఉండి, సోషల్ మీడియా ను కూడా పక్కనపెట్టిన ఆమె మనో భావాలు ఈ కథకు దగ్గరగా ఉన్న సూచనలు లేకపోలేదు. ప్రభాస్ తో ఉన్న రూమర్స్ కానీ, సాన్నిహిత్యం కానీ. ఇంకా పెళ్లిచేసుకోకపోవడం కానీ, మరలా ప్రభాస్ కు చెందిన బ్యానర్ లో నటించడం వల్ల కొంచెం సింక్ అయినట్లుగా ప్రేక్షకులకు తోస్తుంది.
ఈ కథ దర్శకుడు మహేష్ బాబు పి. కొన్ని అనుభవాలు, సంఘటనలు ఆదారంగా తీశానని చెప్పాడు. స్పర్మ్ ద్యారా పిల్లలు అనేది బాలీవుడ్, టాలీవుడ్ లో సుమంత్ చేశారు. కానీ వాటిల్లో లేనిది ఇందులో ఉంది. డోనర్ ద్యారా ఓ మహిళా తల్లి గా మారడం వరకు ఒకే. కానీ.. ప్రేమ, తోడు అనేది ఇందులో చూపించి ఫైనల్గా అమ్మాయికి, అబ్బాయి తోడు ఉండాలి అనేది ఇందులో చెప్పాడు దర్శకుడు.
రొటీన్ కథ కాకుండా పాచ్యాత కల్చర్ స్పర్మ్ అనే కాన్సెప్ట్ తో ఇండియాకు దిగుమతి చేసిన కథ. ఇలాగా కూడా లేడీస్ ఆలోచిస్తారా అనే కొత్త కోణం, అది కూడా ఎంటర్టైన్మెంట్ గా తీశాడు.
సాంకేతికంగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాగుంది, అందమైన లొకేషన్స్‌లో అద్భుతమైన విజువల్స్‌తో ఉన్నాయి. విజువల్స్ సినిమా మొత్తానికి కొత్త ఊపునిచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాకు క్వాలిటీ తోడయ్యాయి. నేపధ్య్ సంగీతం, పాటలు సింక్ అయ్యాయి.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనేది అన్ని వయసుల ప్రేక్షకులు ఆనందించగల కొత్త కథ. ఈ సినిమా రెగ్యులర్ లవ్ స్టోరీ కాకపోవడంతో మరింత ప్రత్యేకం. సరదగా టైం పాస్ సినిమా ఇది. ముగింపులో స్టాండప్ కామిడీ హీరో తన కథ చెపుతూ,, నా లైఫ్ లో జరిగింది లవ్ స్టోరీ నా, రివెంజ్ డ్రామానా, థ్రిల్లర్ ఎదో అర్థం కావడం లేదని అంటాడు. అందుకే ఇప్పటి యువత కొత్తదనంగా ఆలోచించే విధంగా సాగే టైం పాస్ సినిమా అని చెప్పవచ్చు. కుటుంబం కలిసి చూసే సినిమా.
రేటింగ్: 3/5